ఏపీలో కర్నూలు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్లలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఐపీఎస్ అధికారి ఆకె రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్లలో.... ఎస్పీ ఫకీరప్ప ఆధ్వర్యంలో.. కబడ్డీ, వాలీబాల్, మ్యాజికల్ చెయిర్స్ వంటి పోటీలు నిర్వహించారు. గ్రామస్థులతోపాటు... పోలీసులూ పోటాపోటీగా ఆడారు.
కప్పట్రాళ్లలో కాళ్లు దువ్విన కోళ్లు.. పోలీసుల గస్తీ! - Sankranti celebrations in Andhra Pradesh
ఏపీలోని సంక్రాంతి సంబురాలు..... అంబరాన్నంటాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వచ్చిన పిల్లలు, పెద్దలు కలిసి పండుగ చేసుకున్నారు. పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
కర్నూలు సాయిబాబా ఆలయంలో సాయి భక్తమండలి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో గాలిపటాలమయమైంది. ఇక్కడ నిర్వహించిన పతంగుల పండుగలో... విభిన్న గాలిపటాలు వినీలాకాశంలో సందడిచేశాయి. మాజీ మంత్రిగంటా శ్రీనివాసరావు సైతం పతంగులు ఎగరేశారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కళింగ కోమటి యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు జరిగాయి. పండక్కి వచ్చిన అల్లుళ్లు, కుమార్తెలకు సత్కారం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సంక్రాంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.