హైదరాబాద్ మాదాపూర్‌లోని శిల్పారామం సంక్రాంతి సంబురాలకు ముస్తాబైంది. పల్లె వాతావరణాన్ని మైమరపించేలా చక్కగా అలకరించారు. మూడు రోజుల పాటు భాగ్యనగరవాసులకు పల్లె అందాలతో పాటు పండుగ వైభవం తెలియజేస్తూ ఈ వేడులను నిర్వహించనున్నారు.
శిల్పారామంలో మొదలైన సంక్రాంతి వేడుకలు - తెలంగాణలో సంక్రాంతి వేడుకలు
బోగి పండుగకు ముందే శిల్పారామంలో సంక్రాంతి సందడి మొదలైంది. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు.. సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
శిల్పారామంలో మొదలైన సంక్రాంతి వేడుకలు
సంక్రాంతి పండుగ అంటేనే గుర్తుకొచ్చే గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, బుడబుక్కల వారి సందడి, జంగమదేవరులు, పిట్టల దొరలూ.. ఇలా శిల్పారామం సందర్శనకు వచ్చే సందర్శకులకు కనువిందు చేస్తున్నారు. పండుగ రోజుల్లో సాయంత్రం వేళ హంపీ థియేటర్‌లో సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక అధికారి కిషన్‌రావు తెలిపారు.
ఇవీచూడండి:జీహెచ్ఎంసీలో మొదలైన ఉచిత తాగునీటి సరఫరా