దిల్లీలో సీఎం కార్యాలయ పీఆర్వోగా సంజయ్ ఝా - పీఆర్వోగా సంజయ్ ఝా
దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ పౌరసంబంధాల అధికారిగా బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ ఝాను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించినందున రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు అతణ్ని నియమించినట్లు తెలుస్తోంది.
CM KCR PRO of Delhi office
దిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ పౌరసంబంధాల అధికారి (సీఎం పీఆర్వో)గా బిహార్‌కు చెందిన సంజయ్‌కుమార్ ఝాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఆయన పదవిలో ఉంటారు. గతంలో వివిధ ఆంగ్ల పత్రికల్లో ఆయన పనిచేశారు. జాతీయ రాజకీయాలకు సీఎం కేసీఆర్ సన్నద్ధతలో భాగంగా...రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ సూచనల మేరకు సంజయ్ నియామకం జరిగినట్లు తెలుస్తోంది.