తెలంగాణ

telangana

ETV Bharat / city

పారిశుద్ధ్య కార్మికులకే భద్రత కరవు

హైదరాబాద్​ నగరంలో పారిశుద్ధ్య కార్మికులకే భద్రత లేకుండా పోతోంది. సుమారు 20 వేల మందికి కేవలం 25 బస్సులు మాత్రమే కేటాయించినట్లు కార్మికులు తెలిపారు. కనీస దూరం పాటించే అవకాశం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

sanitation workers facing problems in hyderabad
పారిశుద్ధ్య కార్మికులకే భద్రత కరవు

By

Published : Apr 7, 2020, 5:56 PM IST

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే పారిశుద్ధ్య కార్మికులకే రక్షణ లేకుండా పోతోంది. ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, బీఎస్​ రెడ్డినగర్, హయత్​నగర్ తదితర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే కార్మికుల కోసం పరిమిత సంఖ్యలో బస్సులు నడిపుతున్నారు. వేల మంది కార్మికులున్న నగరంలో ఈ కొద్దిపాటి బస్సుల్లోని అవస్థలు పడుతూ కార్మికులు ప్రయాణం చేస్తున్నారు.

కనీస దూరం పాటించాలని చెబుతున్న అధికారులే.. పారిశుద్ధ్య కార్మికులకు ఆ అవకాశం లేకుండా చేస్తున్నారు. సుమారు 20 వేల మందికి కేవలం 25 బస్సులు మాత్రమే కేటాయించినట్లు కార్మికులు తెలిపారు. ఏ ఒక్కరిలో కరోనా లక్షణాలున్న అందరం ఇబ్బందుల్లో పడతామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బస్సుల సంఖ్యతోపాటు, నాణ్యమైన గ్లౌజులు, మాస్కులు అందించాలని పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఈస్ట్​ జోన్​ నాయకుడు మహేశ్​రెడ్డి డిమాండ్​ చేశారు.

పారిశుద్ధ్య కార్మికులకే భద్రత కరవు

ఇవీచూడండి:పలు ప్రాంతాల్లో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details