మారుతున్న ఆహార అలవాట్లలో భాగంగా బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్, నూడుల్స్, టీ, కాఫీ పొడి, జామ్ లాంటి వస్తువులు దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) రంగంలో చాలా కంపెనీలు ఉన్నప్పటికీ అనుమతుల్లో ఆలస్యం, సిబ్బంది కొరతతో జాప్యం జరుగుతోంది. ‘ఇంట్లో పిల్లలు అడుగుతున్నారని జామ్, నూడిల్స్ కోసం ఐదారు దుకాణాలకు వెళ్తే లేవన్న సమాధానం వచ్చింది. కొన్ని కంపెనీల బిస్కెట్లు మార్కెట్లో లేవు’ అని ఎల్బీనగర్‌కు చెందిన ఆనంద్ తెలిపారు. ‘
బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్, డ్రైఫ్రూట్స్ వంటివాటి సరఫరా వారం క్రితం నిలిచిపోయాయి. మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియదు’ అని సూపర్‌మార్కెట్ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఆన్‌లైన్లోనూ తీవ్ర కొరత ఉంటోంది. ఈ-వాణిజ్య సంస్థలకు అనుమతిచ్చినా, సరకులు పరిమితంగా ఉన్నాయి.