తెలంగాణ

telangana

ETV Bharat / city

రైతులను కేసీఆర్‌ మోసం చేశారు: జగ్గారెడ్డి

కేంద్ర నిర్ణయాలను ఒకసారి వ్యతిరేకిస్తూ.. మరోసారి మద్దతిస్తూ సీఎం కేసీఆర్‌ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామనడం సరికాదన్నారు. గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన టీపీసీసీ సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగించారు.

sangareddy mla jaggareddy fires on cm kcr
రైతులను కేసీఆర్‌ మోసం చేశారు: జగ్గారెడ్డి

By

Published : Dec 28, 2020, 4:27 PM IST

భాజపా, తెరాస రైతులకు తీవ్రంగా నష్టం చేస్తున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఒకసారి కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తారని.. మరోసారి మద్దతు ఇస్తారని దుయ్యబట్టారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ ఆధ్వర్యంలో గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.

దిల్లీలో మూడు రోజులున్న కేసీఆర్..‌ తీవ్ర చలిలో ఉద్యమాలు చేస్తున్న రైతులకు ఎందుకు సంఘీభావం ప్రకటించలేదని ఆగ్రహించారు. దిల్లీ నుంచి రాగానే 13రోజులపాటు ఫాంహౌస్‌లో గడిపిన కేసీఆర్‌.. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామనడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని రైతులు ఆలోచించాలని కోరారు.

ఇదీ చూడండి: యాసంగి కోసం రైతుబంధు సాయం పంపిణీ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details