Jaggareddy Boycott CLP Meeting: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కామెంట్లు చేశారు. హైదరాబాద్ తాజ్‌దక్కన్‌లో జరుగుతున్న సీఎల్పీ భేటీని జగ్గారెడ్డి బాయికాట్ చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. తనకు ఎదురైన చేదు అనుభవాలను సమావేశంలో ప్రస్తావించేందుకు వచ్చానని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కుసుమకుమార్ సూచించినట్టు పేర్కొన్నారు. అందుకే భేటీ నుంచి వెళ్లిపోతున్నట్టు జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
అవకాశం లేనప్పుడు ఎందుకు మరీ..
"టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదు. రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన గురించి నాకు తెల్వదు. నాకు ఎదురైన చేదు అనుభవాల గురించి సీఎల్పీ మీటింగ్‌లో ప్రస్తావించాలని వచ్చా. పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని నేతలు సూచించారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశంలో పార్టీ అంశాలను ప్రస్తావిస్తే ఎజెండా చెడిపోతుందన్నారు. నాకెదురైన చేదు అనుభవాన్ని చెప్పేందుకు అవకాశం లేనప్పుడు సీఎల్పీ సమావేశంలో ఉండడమెందుకని వెళ్లిపోతున్నా. అంసెంబ్లీకి వెళ్లటం ఎమ్మెల్యేగా నా హక్కు. అసెంబ్లీకి వెళ్తా.. అక్కడ కేసీఆర్‌తో కొట్లాడతా.." - జగ్గారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే
విభేదాలు పక్కన పెట్టాలి..