రాష్ట్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రులు రోగులు చనిపోయిన తరువాత కుడా వారి కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేయడం మంచిపద్దతి కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌కు త్వరలోనే లేఖ రాస్తానని వెల్లడించారు. కరోనా మూడో దశ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాలని సూచించారు.
ఆ విషయంపై త్వరలోనే సీఎంకు లేఖ రాస్తా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి - సీఎం కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల తీరు దారుణంగా ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రోగులు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులను డబ్బు కోసం వేధించడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. ఈ విషయమై త్వరలోనే సీఎం కేసీఆర్‌కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కరోనా రెండో దశలో ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీసీసీ నూతన అధ్యక్షుడి విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పవచ్చన్న ఆయన... ఇతరుల అభిప్రాయంలో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల నాయకత్వంలోనే తాను పని చేస్తానన్న జగ్గారెడ్డి... హనుమంతురావు సీనియర్ నేత అని... ఆయన ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.
ఇదీ చదవండి:తీవ్ర ఇన్ఫెక్షన్కూ భారతీయ టీకాలు చెక్!