VIZAG RK BEACH: ఎప్పుడూ బంగారంలా మెరిసిపోయే ఏపీలోని విశాఖ ఆర్‌కే బీచ్‌లోని ఇసుక గురువారం నల్లగా మారిపోయింది. ఈ మార్పును చూసి సందర్శకులు ఆందోళన చెందారు. ఇసుక అలా ఎందుకు మారిందోనని భయంతో అటు వైపు ఎవరూ అడుగు కూడా పెట్టలేదు. మాకు తెలిసినంత వరకు ఇలా ఎన్నడూ జరగలేదని స్థానికులు వివరించారు. దీనిపై ఆంధ్ర విశ్వవిద్యాలయం భూవిజ్ఞానశాస్త్ర ఆచార్యులు ధనుంజయరావును సంప్రదించగా..‘సముద్రంలోని మురుగు అప్పుడప్పుడు ఒడ్డుకు కొట్టుకురావడం వల్ల ఇసుక ఇలా మారిపోతుంది. లేదా.. ఇనుప రజను ఎక్కువ శాతం సముద్రంలోంచి బయటికి వచ్చినప్పుడూ ఇలానే నల్లగా మారుతుంది. ఇసుకను పరిశోధిస్తేనే విషయం ఏంటో స్పష్టమవుతుంది’ అని వివరించారు.
VIZAG RK BEACH: ఆ బీచ్‌లో ఇసుక నల్లగా మారింది.. ఎందుకో తెలుసా - విశాఖ తాజా వార్తలు
VIZAG RK BEACH: ఇసుక అంటే ఎవరికైనా బంగారం రంగులో మెరిసేది గుర్తుకు వస్తుంది. కానీ ఇసుక అలా ఉండకుండ నల్లగా మారితే.. అవును మీరు విన్నది నిజమే.. ఎందుకంటే అక్కడ ఇసుక నల్లరంగులో మారింది. మరి అలా నలుపు రంగులో ఎందుకు ఉంది.. ఇంతకీ ఆ బీచ్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఇది చదవండి..
![VIZAG RK BEACH: ఆ బీచ్‌లో ఇసుక నల్లగా మారింది.. ఎందుకో తెలుసా VIZAG RK BEACH](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16081440-1009-16081440-1660277275839.jpg)
VIZAG RK BEACH