దళారులు ఇసుక నుంచి భారీగానే సొమ్ము రాబడుతున్నారు. మూడ్రోజుల్లోనే టన్నుకు రూ.300 ధర పెంచేశారు. వర్షాలతో గోదావరి, మూసీ నదుల్లో వరద వస్తుండటంతో పలు రీచ్‌లలో ఇసుక తవ్వకాలు తగ్గిపోతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహదేవపూర్ 1, 3, 5 రీచ్‌లు.. బొమ్మాపూర్-2, బ్రాహ్మణపల్లి-2 రీచ్‌లు.. భద్రాద్రి జిల్లా పద్మనాభగూడెం రీచ్, నల్గొండ జిల్లా వంగమర్తి, సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం రీచ్‌ల నుంచి లోడింగ్‌ను తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) నిలిపివేసింది. ఇప్పటికే తవ్వితీసి స్టాక్ యార్డుల్లో ఉంచిన ఇసుకనే సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో సగటున రోజుకు 45-50 వేల క్యూబిక్ మీటర్లకుపైగా విక్రయించగా.. జూన్ 17న 37,309 క్యూబిక్ మీటర్లే విక్రయించింది. నదుల్లో నీళ్లు రావడం, నదీ తీరం పక్కనుండే స్టాక్ యార్డుల రోడ్లు వర్షాలకు దెబ్బతినడంతో ఇసుక సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆన్‌లైన్ బుకింగ్‌లో అందుబాటులో ఉంచే పరిమాణాన్ని టీఎస్‌ఎండీసీ కుదిస్తోంది. జులై 16 21,965 క్యూబిక్ మీటర్లు, 17న 20,700 క్యూబిక్ మీటర్లు మాత్రమే అందుబాటులో ఉంచింది.
SAND MINING: ఇసుక సరఫరాలో దళారుల దందా.. మూడు రోజుల్లోనే రూ.300 పెంపు - telangana varthalu
ఇసుక దందా చేస్తూ దళారులు భారీగానే సొమ్ము రాబడుతున్నారు. వర్షాల నేపథ్యంలో ఆన్‌లైన్ బుకింగ్‌లో అందుబాటులో ఉంచే ఇసుక పరిమాణాన్ని టీఎస్‌ఎండీసీ కుదిస్తుండగా... తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉండటం, కొనుగోలుదారులు అధికంగా ఉండటంతో ఇసుకకు డిమాండ్ పెరుగుతోంది. మూడ్రోజుల్లోనే దళారులు టన్నుకు రూ.300 ధర పెంచేశారు.
టన్ను ధర రూ.1,500
తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉండటం, కొనుగోలుదారులు అధికంగా ఉండటంతో ఇసుకకు డిమాండ్ పెరుగుతోంది. మూడు రోజుల క్రితం వరకు సన్న రకం ధర టన్నుకు రూ.1,200-1,300 ఉండగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.1,500 చెబుతున్నారు. దొడ్డు రకం టన్ను రూ.1,350కు విక్రయిస్తున్నారు. ఈ ధరలు లారీ లోడ్ తీసుకుంటేనే. మూడు, నాలుగు టన్నులైతే రూ.1,700 చొప్పున విక్రయిస్తున్నారు. వచ్చే రోజుల్లో ధర మరింత పెరుగుతుందని ఉప్పల్ ప్రాంతంలోని ఓ ఇసుక దళారీ తెలిపారు.
ఇదీ చదవండి: Land Sales: మరో విడత భూముల అమ్మకానికి సిద్ధమవుతోన్న సర్కార్