ఎవరైనా పెళ్లికి వెళ్తే కానుకగా నవ దంపతులను ఆశీర్వదిస్తూ బంగారం, గృహోపకరణాలు, నగదు కానుకగా ఇస్తారు. ఏపీలోని విశాఖ జిల్లాలో ఓ వివాహ వేడుకలో ఇసుకను కానుకగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఓ వ్యక్తి. అనకాపల్లి మండలం కొత్త తలారి వాని పాలెంలో జరిగిన వివాహ వేడుకలో వధూవరులకు కానుకగా ఇసుక అందజేశారు గ్రామానికి చెందిన పూర్ణ. ప్రస్తుతం ఇసుక కష్టాలు ఏపీ ప్రజలను ఎలా వెంటాడుతున్నాయో ఇలా కానుక ద్వారా ఇవ్వటంలో అర్థమవుతోందని అంటున్నారు బంధువులు.
పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..? - విశాఖలో తాజా పెళ్లి న్యూస్
పెళ్లి కానుకగా బంగారం, డబ్బులు ఇవ్వటం చూస్తుంటాం. కానీ ఏపీలోని విశాఖ జిల్లాలోని ఓ వివాహానికి హాజరైన వ్యక్తి వధూవరులకు ఇసుకను కానుకగా ఇచ్చారు. దీనిపై అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?