సామాజిక మధ్యమాల్లో యాక్టివ్గా ఉండే సమంత.. తన సోషల్మీడియా అకౌంట్లలో అక్కినేని పేరును తొలగించింది. అనంతరం ఇది చర్చనీయాశమైంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ఉత్తమ నటి అవార్డు అందుకున్న సందర్భంగా అక్కినేని పేరు మార్పుపై సమంతను ప్రశ్నించగా.. ఆమె స్పందించేందుకు నిరాకరించారు.
"అనవసర కామెంట్లపై నేను స్పందించను. వాస్తవానికి 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్సిరీస్పైనా ట్రోల్స్ వచ్చాయి. వీటన్నింటిపై మాట్లాడే ఉద్దేశం లేదు. ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు."
-సమంత