సమంత, నాగ చైతన్య జంట విడాకుల అంశం తెలిసినప్పటి నుంచి.. వారు సోషల్ మీడియాలో ఏవిధమైన పోస్ట్ పెట్టినప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. సంబంధంలేని విషయాలను కూడా అభిమానులు వీరి జీవితానికి ఆపాదిస్తున్నారు. అయితే తాజాగా సమంత ఇన్స్టాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టుపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. తెలుపు రంగు డ్రస్ ధరించి నడుస్తూ ఉన్న ఫొటోని షేర్ చేస్తూ.. కింది విధంగా రాసుకొచ్చింది.
Samantha: సమంత ఇన్స్టా పోస్ట్ వైరల్ - ఇన్స్టాగ్రామ్
సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్గా మారింది. తెలుపు రంగు డ్రస్ వేసుకొని నడుస్తూ ఉన్న ఫొటోని షేర్ చేసింది. తన మనసులోని భావాన్ని ఓ కవిత రూపంలో తెలిపింది.
samantha instagram post
అక్టోబర్ 8న జరిగే లాక్‌మీ ఫ్యాషన్ షో ప్రమోషన్‌లో భాగంగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిలో ఉన్న నిగూఢార్థన్ని నెటిజన్లు తమకుతోచిన విధంగా ఊహించుకుంటున్నారు.
ఇదీ చూడండి:'నాగ చైతన్య-సమంత అందుకే విడిపోయారు'