తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న సినీ నటి సమంత... పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనుంది(Samantha Defamation Suit updates). సమంత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కూకట్‌పల్లి కోర్టు... నోటీసులు ఇవ్వకుండా నేరుగా పిటిషన్‌ను వేయవచ్చన్న న్యాయవాది బాలాజీ వాదనతో ఏకీభవించింది. వైద్యుడు సీఎల్ వెంకట్రావుతో పాటు రెండు యూట్యూబ్ ఛానళ్లపై... నటి సమంత పరువునష్టం దావా దాఖలు చేశారు.
ఇదీ జరిగింది..
సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై నటి సమంత (Samantha Defamation Suit) కోర్టుకెక్కారు. హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టు(Kukarpally Court)లో పరువునష్టం కేసు (Samantha Defamation Suit) నమోదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైద్యుడు, విశ్లేషకుడు డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు మరో మూడు యూట్యూబ్ ఛానెళ్లపై నటి సమంత కూకట్‌పల్లి కోర్టులో పరువునష్టం దావా (Samantha Defamation Suit) దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో తన వైవాహిక జీవితంపై సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ యూట్యూబ్ ఛానెళ్లలో వెంకట్రావు తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్లో సమంత పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అబద్ధపు వ్యాఖ్యలు చేశారన్నారు.