ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టీకా వేసుకోని తితిదే(TTD) సిబ్బందికి జీతాలు నిలుపుదల చేయాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి (TTD EO Jawahar reddy) ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని పలుమార్లు సూచించినా కొందరు నిర్లక్ష్యం చేశారని.. అటువంటి వారికి జూన్ నెల జీతాలు ఆపాలని అన్ని విభాగాల హెచ్వోడీలకు ఆయన నోట్ పంపించారు.
tirumala: తితిదేలో ఆ సిబ్బందికి జీతాలు నిలుపుదల.. కారణమిదే.! - తితిదే సిబ్బందికి వ్యాక్సినేషన్
ఏపీలో కరోనా టీకా వేసుకోని తితిదే సిబ్బందికి జీతాలు నిలుపుదల చేయాలని తితిదే ఈవో జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఇవ్వాలని నోట్లో పొందుపరిచారు.
తితిదే సిబ్బంది జీతాలు నిలుపుదల
ఫ్రంట్ లైన్ సిబ్బందితో పాటు, 45 ఏళ్లకు పైన ఉన్న వాళ్లు వ్యాక్సిన్ వేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఇవ్వాలని నోట్లో పొందుపరిచారు. టీకా వేసుకున్నట్లు నిర్ధరించిన తర్వాత... మళ్లీ సప్లిమెంటరీ బిల్లులను 8న పంపించాలని స్పష్టం చేశారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బంది బిల్లులను మాత్రం వెంటనే చెల్లించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి:Harish Rao: చెత్తను ఆదాయ వనరుగా మారుస్తాం... గ్యాస్ తయారు చేస్తాం