తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆగస్టు నెల జీతాలు, పింఛన్లు మరింత ఆలస్యం! - పింఛనర్ల వార్తలు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు.. ఆగస్టు నెల జీతాలు, పింఛన్లు ఆలస్యం కానున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్నవి రూ.500 కోట్లే కావటంతో.. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద నిధుల కోసం ఏపీ సర్కారు ఆర్‌బీఐకి లేఖ రాసింది.

ap government salaries
ఆగస్టు నెల జీతాలు, పింఛన్లు మరింత ఆలస్యం!

By

Published : Sep 1, 2020, 12:22 PM IST

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు, పింఛన్లు ఈసారి కూడా కొంత ఆలస్యం కానున్నాయి. ప్రస్తుతం చేతిలో ఓ అండ్ ‌ఎం కింద దాదాపు రూ.500 కోట్లు మాత్రమే నిధులున్నట్లు సమాచారం. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సవరించడంతో ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్లు రానుంది. ఆ నిధులు రాబట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు లేఖ రాసింది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో రూ.3 వేల కోట్ల రుణాల సమీకరణకూ ప్రయత్నిస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం.

రిజర్వు బ్యాంకులో ఇవాళ.. సెక్యూరిటీల వేలం ఉంది. దానిలో పాల్గొనేందుకు ఏపీ సర్కారు ప్రయత్నం చేస్తోంది. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ నిధులు వచ్చిన వెంటనే జీతాలు, పింఛన్ల చెల్లింపు ప్రారంభమవుతుంది. ఆ నిధులు మంగళవారం సాయంత్రానికి అందుతాయా? లేక బుధవారం వస్తాయా అన్నది చూడాలి.

ప్రస్తుతం ఉన్న నిధులతో కొద్ది మందికి చెల్లింపులు చేస్తారా.. లేక అందరికీ ఒకేసారి వేతనాలు చెల్లిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. జీతాలు, పింఛన్లకు కలిపి మొత్తం సుమారు రూ.4 వేల 300 కోట్ల వరకు అవసరమవుతాయి.

ఇవీచూడండి:పులికి చెమటలు పట్టించిన ఏనుగు!

ABOUT THE AUTHOR

...view details