హైదరాబాద్‌లో ఇటీవల వచ్చిన వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి ప్రజలకు అండగా ఉండేందుకు సాలరే మిల్లత్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కోటిన్నర రూపాయల సాయం అందించింది. నీటిలో కొట్టుకుపోయిన, దెబ్బతిన్న ఓలా, ఉబెర్ కార్లు, ఆటోల మరమ్మతుల కోసం ఒక్కొక్కరికి రూ.15 నుంచి రూ.20 వేలు, ద్వికచక్రవాహనదారులకు రూ.4 నుంచి రూ.5 వేల సాయం అందిస్తున్నట్టు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ట్రస్ట్ ఛైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.
పిల్లల పెళ్లిల కోసం సమకూర్చుకున్న వస్తువులు పోగొట్టుకున్న 50 కుటుంబాలకు రూ.50 చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. చిన్నచిన్న దుకాణాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. నిత్యావసర సరకులతో కలిపి 33 వస్తువుల కిట్‌ను బాధితులందరికిీ పంపిణీ చేయనున్నారు. ఇప్పటి వరకు 6వేల వరద బాధితులకు పాలు, బ్రెడ్, నీరు, భోజనాల కోసం ట్రస్ట్ నుంచి రూ.18 లక్షలు ఖర్చు చేసినట్టు అక్బరుద్దీన్ వెల్లడించారు. ఈ సేవలు కొనసాగించనున్నట్టు తెలిపారు.