ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని మారుతి సెంటర్ కనకదుర్గమ్మ అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు కనువిందుచేశారు. పవిత్ర ఆషాఢమాస శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారిని 58 రకాల కూరగాయలు, వివిధ రకాల పండ్లతో సుందరంగా అలంకరించారు.
కూరగాయలు, పండ్లతో ముస్తాబైన కనకదుర్గమ్మ... భారీగా తరలివచ్చిన భక్తులు - andhrapradesh news
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని మారుతి సెంటర్ కనకదుర్గమ్మ అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పవిత్ర ఆషాఢమాస శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారిని కూరగాయలు, వివిధ రకాల పండ్లతో అలంకరించారు.

kanakadurgamma temple
ఆలయం అంతా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు, ఆలయ కమిటీ సహకారంతో కార్యక్రమం నిర్వహించామని.. ఆలయ కమిటీ అర్చకులు పుల్లేటికుర్తి కృష్ణ శర్మ, యలమంచిలి వీర ప్రసాద శర్మ తెలిపారు.