Sajjala: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల స్పందన - Sajjala: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల స్పందన
13:53 March 12
Sajjala: ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల స్పందన
ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకేముందని ఆయన ప్రశ్నించారు. అది చంద్రబాబు రాగమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటికే అడుగంటిన పార్టీ(తెదేపా)ని కాపాడుకునేందుకు చంద్రబాబు ముందస్తు డ్రామాకు తెరతీశారని విమర్శించారు. మాకు ఐదేళ్లు ప్రజలు అధికారం ఇచ్చారని.. ఆ కాలాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఏముందని సజ్జల ప్రశ్నించారు. ప్రజలను మోసం చేయాలి, భ్రమపెట్టాలి అనుకున్నవారే ముందస్తుకు వెళతారని సజ్జల స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: BellamKonda Suresh Controversy : 'నా కొడుకు జోలికొస్తే ఊరుకునేది లేదు'
TAGGED:
sajjala