Sajjala On Employees IR: ఏపీ సీఎం జగన్కు ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలశాఖ అధికారులతో పాటు సీఎస్ సమీర్ శర్మ పీఆర్సీకి సంబంధించిన వివరాలను అందించారు. సెంట్రల్ పీఆర్సీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల జీతాలు కొంత మేర తగ్గుతున్నాయని గుర్తించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మధ్యంతర భృతి 27 శాతం కంటే తగ్గకుండా కొంత మేర పెరిగేలా మళ్లీ కసరత్తు చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారని ఆయన తెలిపారు.
Sajjala On Employees PRC: రేపు, ఎల్లుండి అధికారులు ఈ విషయంపై కసరత్తు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆయా అంశాలను సీఎంకు వివరిస్తారన్నారు సజ్జల. ఈ నెలాఖరుకు మొత్తం ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని.. ఆ తర్వాతే పీఆర్సీ ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఐఆర్ ఇవ్వలేదు.. నేరుగా పీఆర్సీనే ప్రకటించిందన్నారు. కొవిడ్ పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకునే కొత్త పీఆర్సీ ప్రకటన ఉంటుందని.. ఉద్యోగులు ఆర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యోగులు ఎక్కువ ఊహించుకుని తర్వాత నిరుత్సాహపడే కంటే ముందే వాస్తవాలను గ్రహిస్తే మంచిదని సజ్జల హితవు పలికారు.