తెలంగాణ

telangana

ETV Bharat / city

Sajjala: హోదా కోసం రాజీనామా చేసి చూపించాం.. మిమ్మల్ని ఎవరైనా ఆపారా..? - ఏపీ ప్రత్యేక హోదా

ఏపీ తెదేపా ఎంపీలపై ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రతి అంశంలో వైకాపా వారి రాజీనామాలను ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలనుకుంటే.. చేయొచ్చని హితవు పలికారు

SAJJALA
SAJJALA

By

Published : Jul 24, 2021, 10:50 PM IST

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెదేపా ఎంపీలు రాజీనామా చేయాలనుకుంటే... చేయొచ్చని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి అంశంలో వైకాపా ఎంపీల రాజీనామా కోసం ఎందుకు డిమాండ్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో వైకాపా ఎంపీలు రాజీనామా చేసి ఆమోదింపజేసుకున్నారని గుర్తు చేశారు. కోర్టులు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంశాన్ని ఏ కోణంలో చూశాయే తెలియదన్న సజ్జల.. అమరావతి అనేది ఓ కుంభకోణమని అందరికీ తెలుసన్నారు. విశాఖ ఉక్కును కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

హోదా కోసం రాజీనామా చేసి చూపించాం.. మిమ్మల్ని ఎవరైనా ఆపారా..?

"ప్రత్యేక హోదా కోసం తెదేపా ఎంపీలు రాజీనామా చేయవచ్చు కదా? ప్రతిఅంశంలో వైకాపా వారి రాజీనామాలు ఎందుకు డిమాండ్‌ చేస్తారు..? కోర్టులు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంశాన్ని ఏ కోణంలో చూశాయో తెలియదు. అమరావతి అనేది ఓ కుంభకోణమని అందరికీ తెలుసు. అధికార రహస్యాల చట్టాన్ని చంద్రబాబు ఉల్లంఘించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రతిపక్ష నేతగా జగన్ ఆందోళన చేశారు" -సజ్జల రామకృష్ణారెడ్డి , ప్రభుత్వ సలహాదారుడు

రఘురామ వెనుక చంద్రబాబు..

రఘురామకృష్ణ రాజు వెనుక చంద్రబాబు ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఇరువురూ ప్రభుత్వంపై సమన్వయంతో కూడిన కుట్ర చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఐడీ స్వాధీనం చేసుకున్న ఆయన ఫోన్ లో న్యాయమూర్తులపైనా దుర్భాషలు ఆడిన ఆడియోలు ఉన్నట్టు తెలుస్తోందని సజ్జల వ్యాఖ్యానించారు. పెద్ద మొత్తంలో ఆర్ధికలావాదేవీలు కూడా ఉన్నాయని అన్నారు. రికార్డెడ్ గా ఎంపీ రఘురామ కృష్ణం రాజు దొరికిపోయారని అన్నారు. న్యాయమూర్తులను దుర్భాషలాడిన అంశాలను కోర్టు సుమోటోగా తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

CM KCR Phone Call: హుజూరాబాద్​పై కేసీఆర్ మాస్టర్​ ప్లాన్.. ఆడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details