తెలంగాణ

telangana

ETV Bharat / city

కేసీఆర్‌ కావాలనుకుంటే.. ఏపీలో పార్టీ పెట్టుకోవచ్చు: సజ్జల - తెలంగాణ సీఎం కేసీఆర్

ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు. కేసీఆర్‌.. ఏపీలో పార్టీ పెడతానంటే ఎవరైనా వద్దన్నారా? పార్టీ పెట్టొద్దని ఎవరూ చెప్పలేదన్నారు.

sajjala rama krishna reddy
sajjala rama krishna reddy

By

Published : Oct 27, 2021, 10:58 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలు విధిస్తున్నారని తెరాస అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. శ్రీశైలం నీటిని అడ్డగోలుగా వాడినందుకే తెలంగాణకు మిగులు కరెంటు వచ్చిందన్నారు. హైదరాబాద్ లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం ద్వారా ఏపీలో అంధకారం అలుముకుంటుందనే విషయాన్ని ముందే చెప్పామని.. ఈ విషయంలో కేసీఆర్ చెప్పింది వాస్తవమేనన్నారు. రాష్ట్రం విడిపోతే ఏపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని, నీటి సమస్యలు వస్తాయని గతంలో చెప్పామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన సజ్జల స్పందించారు. కేసీఆర్‌.. ఏపీలో పార్టీ పెడతానంటే ఎవరైనా వద్దన్నారా? పార్టీ పెట్టొద్దని ఎవరూ చెప్పలేదన్నారు. రాజకీయ పార్టీని ఎవరైనా ఎక్కడైనా పెట్టొచ్చని.. దానికి ఎవరి అనుమతులు అవసరం లేదని పేర్కొన్నారు. ఎవరైనా రావచ్చని, ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోకుండా ఉండి ఉంటే దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేదని సజ్జల అభిప్రాయపడ్డారు.

ఇదీచూడండి:

ABOUT THE AUTHOR

...view details