జల వివాదాలపై(water dispute) రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని వ్యాఖ్యానించారు. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోమని స్పష్టం చేశారు. జలవివాదంపై ఇప్పటికే అందరికి లేఖలు(letters) రాశామని తెలిపారు.
WATER DISPUTE : 'ఏపీ ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం' - sajjala ramakrishna reddy warn to kcr news
జల వివాదాలపై తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్యవర్తిత్వం వహిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(sajjala ramakrishna reddy) అన్నారు. ఈ అంశంపై రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని సూచించారు. ఏపీ ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని తెలిపారు.
సజ్జల రామకృష్ణారెడ్డి
ఇదీ చదవండి :TS -AP water war: 'తెలంగాణ నీళ్లు దోచుకుపోతే ఊరుకునేది లేదు'
జల వివాదంపై కేంద్రం(central govt) కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతామని అన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని హామీ ఇచ్చారు. రెచ్చగొడితే రెచ్చిపోం, సందర్భోచితంగా స్పందిస్తామని సజ్జల స్పష్టం చేశారు.