తెలంగాణ

telangana

ETV Bharat / city

Sajjala On Fitment to Govt Employees: 'ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో చర్చించే అవకాశం' - సజ్జల తాజా వార్తలు

Sajjala On Fitment to Govt Employees: ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ సీఎం జగన్‌తోనూ చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని చెప్పారు

ఏపీ సీఎం
ఏపీ సీఎం

By

Published : Dec 14, 2021, 7:00 PM IST

Sajjala On Fitment to Govt Employees: ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ సీఎం జగన్‌తోనూ చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఉద్యోగులకు ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తున్నామని చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఉద్యోగులకు నష్టం ఉండదన్నారు. 14.29 శాతం ఫిట్‌మెంట్ వల్ల ఐఆర్ కంటే రూపాయి కూడా తగ్గదన్న ఆయన.. 14.29 శాతం పీఆర్‌సీతో ఐఆర్ కంటే ఎక్కువగానే లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు కోరే 45 శాతం సాధ్యం కాదని కమిటీ చెప్పిందని సజ్జల గుర్తు చేశారు.

Sajjala On Employees Fitment: కరోనాతో ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని సజ్జల తెలిపారు. అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్ కమిటీ ప్రతిపాదనలున్నాయని వెల్లడించారు. సీఎస్ కమిటీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ను పెంచే అవకాశం ఉందన్న సజ్జల.. ప్రస్తుత పీఆర్‌సీ అమలుకు ఏడెనిమిది ఏళ్లు పడుతోందని చెప్పారు. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పదేళ్లకు ఒకసారి ఇచ్చినా నష్టం ఉండదన్నారు.

వారికి మినిమం టైం స్కేల్..

Sajjala On CPS: సీపీఎస్ రద్దుపై ఏపీ సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారని సజ్జల పేర్కొన్నారు. ఈ అంశంపై పలు కమిటీలు అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. సుప్రీం తీర్పు వల్లే ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యం కాలేదన్నారు. ఒప్పంద ఉద్యోగులకు చట్టపరిధిలో న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నామన్న సజ్జల.. వారికి మినిమం టైం స్కేల్ అమలుచేసే యోచన ఉందన్నారు.

'సీఎస్ కమిటీ సిఫారసు చేసిన ఫిట్‌మెంట్‌ను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్‌సీ అమలుకు ఏడెనిమిది ఏళ్లు పడుతోంది. సెంట్రల్ పే కమిషన్ ప్రకారం పదేళ్లకు ఒకసారి ఇచ్చినా నష్టం ఉండదు. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారు. దీనిపై కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు వల్లే ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ సాధ్యం కాలేదు. ఒప్పంద ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలుచేసే యోచనలో ఉన్నాం'

-- సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు

ఇవాళ ఉదయం ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల చర్చలు జరిపారు. తొలుత సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో మాట్లాడారు. అనంతరం సజ్జలతో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి సంఘం నేతలు సమావేశమయ్యారు. సీఎస్‌ కమిటీ ఇచ్చిన పీఆర్‌సీ నివేదిక అమలుపై చర్చించారు.

ఇదీ చదవండి:TRS Wins MLC Election 2021 : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం

ABOUT THE AUTHOR

...view details