తెలంగాణ

telangana

ETV Bharat / city

Sajjala On Early Elections: 'రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు.. కానీ' - early polls in ap

ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారంపై.. ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ప్రజలు తమకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో మందుస్తు ఎన్నికలు ఉండవన్నారు.

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

By

Published : Jan 5, 2022, 9:48 PM IST

Sajjala On Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారని.. ముందస్తు ఎన్నికలకు ఎందుకెళ్తామని ప్రశ్నించారు. ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. కేంద్రం నుంచి ఆదేశాలుంటే (జమిలీ ఎన్నికలు) తప్ప ముందస్తు ఎన్నికలు ఉండబోవని సజ్జల తేల్చి చెప్పారు.

ప్రజల సంక్షేమం కోసమే ఏపీ ప్రభుత్వం అప్పులు తెస్తోందని పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు 1.21 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేశామని పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసంపై చర్యలు తీసుకున్నామని.. రాష్ట్రంలో ఎక్కడా విధ్వంసం జరగడం లేదని వ్యాఖ్యానించారు.

"ప్రజలు ఐదేళ్లు అధికారం ఇచ్చారు, ముందస్తు ఎన్నికలకు ఎందుకెళ్తాం?. ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటాం. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. కేంద్రం నుంచి ఆదేశాలుంటే తప్ప ముందస్తు ఎన్నికలు ఉండవు" - సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

ఇదీచూడండి:పనిచేయలేని వారు పక్కకు తప్పుకోండి.. ఢీ అంటే ఢీ అనేవారే కావాలి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details