తెలంగాణ

telangana

ETV Bharat / city

హీరో సిద్ధార్థ్ క్షమాపణలు.. స్పందించిన షట్లర్ సైనా - saina sid

Siddharth saina nehwal: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనాపై అసభ్యకర ట్వీట్ చేసి, వివాదంలో ఇరుక్కున్న సిద్ధార్థ్.. ఎట్టకేలకు బహిరంగ క్షమాపణ చెప్పారు. తనను క్షమించాలని కోరారు.

saina  siddarth
saina siddarth

By

Published : Jan 12, 2022, 1:12 PM IST

Siddharth tweet: స్టార్ షటర్ల్ సైనా నెహ్వాల్​కు హీరో సిద్ధార్థ్ క్షమాపణ చెప్పారు. ట్వీట్ ద్వారా కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఓ లేఖను ట్వీట్ చేశారు. అది కేవలం ఓ జోక్ మాత్రమేనని, మనసును బాధపెట్టిఉంటే తనను క్షమించాలని రాసుకొచ్చారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేద్దామని అన్నారు.

హీరో సిద్ధార్థ్ తనకు క్షమాపణ చెప్పడంపై స్టార్ షట్లర్​ సైనా నెహ్వాల్​ స్పందించింది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అలాంటి ట్వీట్​లు​ చేయడం సరికాదని స్పష్టం చేసింది. అయినా తాను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది.

"నా ట్వీట్​పై సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఎందుకు వైరల్​ అయ్యాయో తెలియలేదు. సిద్ధార్థ్​ ట్వీట్ ట్రెండ్ కావడం ఆశ్చర్యంగా అనిపించింది. అతను క్షమాపణలు చెప్పినందుకు సంతోషం" అని సైనా ట్విట్టర్​లో రాసుకొచ్చింది.

అసలు ఏం జరిగింది?

ఇటీవల పంజాబ్​లో ప్రధాని మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ప్రధాని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. దీనిపై వ్యంగ్యంగా స్పందించిన హీరో సిద్ధార్థ్.. అసభ్యకర రీతిలో సైనాపై కామెంట్ చేశారు. అది కాస్త పెద్ద దుమారమైంది.

సిద్ధార్థ్ ట్వీట్​పై సైనా కుటుంబ సభ్యులతో పాటు జాతీయ మహిళా కమిషన్​ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని, సిద్ధార్థ్ ట్విట్టర్​ ఖాతాను డిలీట్​ చేయాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ మధ్య కాలంలో సిద్ధార్థ్ పలు వివాదాస్పద ట్వీట్​లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి చెత్త కామెంట్స్ చేసి, సారీ చెబితే సరిపోతుందా అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా పలు హిట్​ సినిమాలతో అలరించిన సిద్ధార్థ్.. గతేడాది 'మహాసముద్రం' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆ సినిమా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది.

For All Latest Updates

TAGGED:

saina sid

ABOUT THE AUTHOR

...view details