రోడ్డు ప్రమాదానికి గురైన నటుడు సాయిధరమ్ తేజ్.. మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం మధ్యాహ్నం వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని చెప్పారు. కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. సాయి తేజ్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.
ఫలించిన అభిమానుల పూజలు.. సాయిధరమ్ తేజ్ సర్జరీ విజయవంతం
రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej road accident) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.
Sai Dharam Tej surgery
శుక్రవారం రాత్రి తీగల వంతెన నుంచి ఐకియా వైపు వెళ్తుండగా సాయి తేజ్ బైక్ నుంచి కిందపడి ప్రమాదానికి గురయ్యారు. తేజ్‌ను పలువురు సినీ నటులు ఆస్పత్రిలో పరామర్శించారు.
ఇదీ చూడండి:SAI DHARAM TEJ: తేజ్ ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్.. కారణాలివే.!