తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఇంట్లోకి ఏ వస్తువు తేవాలన్నా భయమా ? మీ కోసమే ఇది' - safe way disinfected latest news

కరోనా విపత్కర సమయంలో ఏ వస్తువును ఇంట్లోకి తీసుకురావాలన్నా వైరస్ సోకుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ స్టార్టప్ సేఫ్ వే అడ్వాన్స్ డిస్ఇన్ఫెక్టెడ్ సంస్థ అత్యాధునిక యూవీ శానిటైజర్ బాక్స్​తో పాటు అల్ట్రావైలేట్ స్టెరిలైజేషన్ పరికరాలను అందుబాటులోకి తెచ్చింది.

ఇంట్లోకి ఏ వస్తువు తేవాలన్నా భయమా ? మీకోసమే ఇది
ఇంట్లోకి ఏ వస్తువు తేవాలన్నా భయమా ? మీకోసమే ఇది

By

Published : Jul 23, 2020, 11:17 PM IST

సికింద్రాబాద్​లోని ఓ హోటల్​లో అత్యాధునిక యువి శానిటైజేర్ బాక్స్ 360 ని హైదరాబాద్ స్టార్టప్ సేఫ్ వే సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. దేశంలోనే మొదటిసారిగా కొవిడ్​పై పరీక్ష జరిపి సీసీఎంబీ ధ్రువీకరించిందని సంస్థ వ్యవస్థాపకుడు సివీఎన్ వంశీ వెల్లడించారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని రకాల వస్తువులను శానిటైజ్ చేసుకోవచన్నారు. ఫలితంగా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఈ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

రూ.15,000 నుంచి లక్ష వరకు

నిత్యావసర వస్తువులు ,కూరగాయలు,నగలు, బహుమతులు ఇంట్లో వాడే ప్రతి వస్తువును బాక్స్ 360 అనే పరికరంలో ఉంచితే వస్తువుల ఉపరితలం మీద ఉండే వైరస్ పూర్తిగా నశిస్తుందని పేర్కొన్నారు. కేవలం 3 నుంచి 10 నిమిషాల్లో ప్రతి వస్తువును శుభ్రపరిచే విధంగా పరికరాన్ని తయారు చేశామన్నారు. మధ్యతరగతి వారికీ అందుబాటులో ఉండే విధంగా రూ.15,000 నుంచి రూ.లక్ష లోపు ఈ బాక్సులు అందుబాటులో ఉన్నట్లు స్పష్టం చేశారు. అల్ట్రా వైలేట్ స్టెరిలైజేషన్​కు సంబంధించిన పరికరం ద్వారా ఒక గదిలో, బహిరంగ ప్రదేశాల్లో వైరస్ చనిపోయే విధంగా రేడియేషన్ కిరణాలు విడుదలయ్యే పరికరాలనూ తయారు చేసినట్లు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వ్యాపారాలను సాధారణ స్థితికి తేవడానికి 'సేఫ్ వే అడ్వాన్సుడ్ డిజిన్ఫెక్టేడ్' సంస్థ పరిశోధనల ద్వారా రూపొందించిందన్నారు.

ఇవీ చూడండి : 'రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశ.. అప్రమత్తంగా ఉండాలి'

ABOUT THE AUTHOR

...view details