తెలంగాణ

telangana

ETV Bharat / city

ఐదో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. హైదరాబాద్‌లో ప్రారంభించనున్న సద్గురు - హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అయిదో విడత

Sadguru inaugurates green India challenge : పుడమిని రక్షించుకుందాం.. నేలతల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందామంటూ ప్రపంచ యాత్ర చేపట్టిన సద్గురు ఇవాళ హైదరాబాద్‌ చేరుకుంటారు. రేపు మధ్యాహ్నం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లోని అటవీ పార్క్‌లో ఎంపీ సంతోశ్ కుమార్‌తో కలిసి మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Sadguru inaugurates green India challenge
Sadguru inaugurates green India challenge

By

Published : Jun 15, 2022, 10:59 AM IST

Sadguru inaugurates green India challenge : పర్యావరణహితం, దేశవ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ అయిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్‌లోనే మొక్కలునాటే ఉద్యమం మొదలుకాబోతోంది. పుడమిని రక్షించుకుందాం, నేలతల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందామంటూ సద్గురు ప్రపంచయాత్ర చేపట్టారు. ఆ యాత్ర నేడు హైదరాబాద్ చేరుకొని... 16న కర్నూలు మీదుగా బెంగుళూరు వెళ్తుంది.

రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్.... ఐదేళ్ల కింద చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్న సద్దురు.. ఆ కార్యక్రమంతో తానూ పాల్గొని మొక్కలు నాటేందుకు సుముఖత తెలిపారు. ఇందులోభాగంగా రేపు మధ్యాహ్నం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొల్లూరు అటవీపార్క్‌లో సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటి, ఐదోవిడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను జగ్గీ వాసుదేవ్‌ ప్రారంభిస్తారు.

మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ హాజరై మొక్కలు నాటుతారు. ఈ ఐదోవిడతలో గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను మరింతగా విస్తరించేందుకు... దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తామని ఎంపీ సంతోష్ కుమార్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details