On This Day in 2010:గ్వాలియర్‌లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో ఫిబ్రవరి 24, 2010న సచిన్ తెందూల్కర్ రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో కేవలం 147 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి.. వన్డేల్లో 200 పరుగులు చేసిన మొదటి వ్యక్తిగా రికార్డును సచిన్ తన పేరిట లిఖించుకున్నాడు.
24th February 2010: ఫస్ట్ డబుల్ సెంచరీతో సచిన్ రికార్డు సృష్టించింది ఈరోజే - సచిన్ తెందూల్కర్
Sachin Tendulkar First Double Century: ఫిబ్రవరి 24, 2010.. ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని గుర్తుపెట్టుకునే సంఘటన జరిగింది ఈ రోజే. ఒక ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడం కూడా బ్యాటర్‌కు కష్టంగా ఉన్న రోజుల్లోనే.. 200 పరుగులు చేసిన మొదటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్.
Sachin Tendulkar First Double Century
ఆ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాను 248 పరుగులకే ఆలౌట్ చేసిన టీంఇండియా.. ఈ మ్యాచ్‌లో 153 పరుగుల తేడాతో విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఒక ఇన్నింగ్స్‌లో 150 కంటే ఎక్కువ పరుగులు చేయడం కూడా బ్యాటర్‌కు కష్టంగా ఉన్న రోజుల్లోనే సచిన్ తెందూల్కర్ చరిత్ర సృష్టించాడు.
ఇదీ చూడండి:మిథాలీ సంచలన నిర్ణయం.. ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్