తెలంగాణ

telangana

ETV Bharat / city

సీవీడ్ : ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయం.. పోషకాలు ఘనం - Seaweed have good vitamins

తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలు పొందగలమా? ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం దొరుకుతుందా? ఈ రెండు ప్రశ్నలకూ సీవీడ్‌(సముద్రనాచు)తో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు విశాఖపట్నానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ జెస్మి...

Sachets made with seaweed in visakhapatnam andhra pradesh
సముద్రనాచుతో సాచెట్స్

By

Published : Feb 23, 2021, 10:32 AM IST

ముద్రనాచు...పోషకాలకు పెట్టింది పేరు. దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. శరీరానికి మేలుచేసే మాంసకృత్తులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా సముద్రనాచుని ఉపయోగించి తక్కువ ఖర్చులో పోషకాహార తయారీపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని కేంద్ర మత్స్య సాంకేతిక సంస్థ(సి.ఐ.ఎఫ్‌.టి.)లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్‌ జెస్మిడెబర్మ సముద్రనాచుతో సాచెట్లని తయారుచేశారు.

ఈ ప్రత్యేకమైన సాచెట్లు అటు పర్యావరణ కాలుష్యానికీ, ఇటు పోషకాహారలేమికి కూడా చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవి మసాలాలు వంటివి ప్యాక్‌ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ‘నూడుల్స్‌, కూరలు లాంటివాటిల్లో మసాలాలతో నింపిన ఈ సాచెట్లను నేరుగా వేసేయొచ్చు. ఇవి తేలికగా కరిగిపోయి పోషకాలని అందిస్తాయి. మరోపక్క ప్లాస్టిక్‌ వ్యర్థాల సమస్యా ఉండదు’ అని అంటున్నారు డాక్టర్‌ జెస్.

ABOUT THE AUTHOR

...view details