ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన కొనసాగుతోందని, ఎలాంటి అవినీతి అభియోగం లేని తనపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా పాలనాధికారికి లేఖ రాసిన ఆయన... తనపై వస్తున్న ఆరోపణలను పరిశీలించాలన్నారు.
'ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది' - మాజీ ఎంపీ సబ్బం హరి నేటి వార్తలు
ఉద్దేశపూర్వకంగానే తనపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్కు ఆయన లేఖ రాశారు.
'ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది'
అర్థం లేని ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శనివారం... తాను సహనం కోల్పోయి మాట్లాడానని, ఆవేశంలో రెండు పదాలు వాడినందుకు మన్నించాలని కోరారు. ఇక ముందు అలాంటి పదాలు వాడబోనని స్పష్టం చేశారు.