విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో జరిగిన చీకటి ఒప్పందాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖలో దీక్ష చేస్తున్న తెదేపా నేత పల్లా శ్రీనివాస్‌కు ఆయన సంఘీభావం తెలిపారు. పల్లా పోరాట పటిమను ప్రశంసించారు. ఉద్యమం మరింత ఉద్ధృతం కావాలన్న సబ్బం.. ఏపీ సీఎం జగన్.. కేంద్రానికి లేఖలు రాస్తే సరిపోదన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై కేంద్రం, ఏపీ ప్రభుత్వాల మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటికి రావాలి. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సమాధానం చెప్పాలి. పల్లా శ్రీనివాస్‌కు అండగా ఉంటా. ఆయన ఆశయ సాధన కోసం నేను కూడా దీక్షలో కూర్చుంటా.