Sabarimala special trains 2021-2022 : శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులతో రైళ్లకు తాకిడి బాగా ఉంది. రోజూ వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇప్పటికే ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఈ నేపథ్యంలో మరో 28 ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
జనవరి 3 నుంచి 16 వరకు..
Special Trains to Sabarimala : ఇవి జోన్ పరిధిలోని కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ స్టేషన్ల నుంచి కేరళలోని కొల్లం రైల్వేస్టేషన్‌కు.. అక్కడినుంచి ఈ స్టేషన్లకు నడుస్తామని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 3 నుంచి 16 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రైళ్లలో సెకండ్, థర్డ్ ఏసీ, స్లీపర్‌తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయని, అన్ని బోగీల్ని రిజర్వేషన్‌తో నడిపించనున్నట్లు ద.మ.రైల్వే పేర్కొంది. అయ్యప్ప భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.