తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటి నుంచి రైతు భరోసా..49లక్షల మందికి లబ్ది - రైతు భరోసా వార్తలు

ఏపీలో రైతు భరోసా పథకం రెండో ఏడాది నిధులను నేటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 49,43,590 మంది రైతులకు నిధులు పంపిణీ చేయనున్నారు.

rythu-bharos
నేటి నుంచి రెండో విడత రైతు భరోసా

By

Published : May 15, 2020, 7:48 AM IST

ఆంధ్రప్రదేశ్​లో రైతు భరోసా పథకం రెండో ఏడాది నిధులను ఇవాళ్టి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్నారు. సాధారణ లబ్ధిదారులు 46,28,767 మందిగా ప్రభుత్వం నిర్ణయించింది. చనిపోయిన వారి వారసులు 61,555.. వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం కాని వారు 2,12,025 గా పేర్కొంది. దేవాదాయ భూముల రైతులు 623, అటవీ భూములు సాగు చేసుకునే వారు 40,620 మంది లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు.

ఒక్కొక్కరి ఖాతాలో రూ.7,500 జమ చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.2వేల పీఎం కిసాన్‌ నిధులు గత నెలలోనే రైతుల ఖాతాలో జమయ్యాయి. మిగిలిన డబ్బులను ఇప్పుడు వేయనున్నారు. పథకానికి ప్రభుత్వం రూ.505 కోట్ల అదనపు నిధులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

ABOUT THE AUTHOR

...view details