రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ - telangana rythu bandhu
రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ
12:32 January 11
కర్షకుల ఖాతాల్లో రైతు బంధు సాయం
రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. 59 లక్షల 15వేల 905 మంది కర్షకులకు చెందిన కోటీ 47 లక్షల 3వేల ఎకరాలకు సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.
రైతు బంధు నగదు కర్షకుల ఖాతాలో జమ చేసినట్లు జనార్ధన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సర్కార్ కర్షకుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తోందని పేర్కొన్నారు.