రైతుబంధు సాయాన్ని ఈ నెల 27 నుంచి వచ్చే నెల ఏడు వరకు రైతులకు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. యాసంగి సీజన్ రైతుబంధు సాయం పంపిణీపై ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్ - రైతుబంధుపై కేసీఆర్ సమీక్ష
16:56 December 07
ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్
రైతుబంధు సాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి, కార్యాచరణను ఖరారు చేశారు. రాష్ట్రంలోని అన్నదాతలందరికీ సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం కోసం రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి మొదలుపెట్టి, ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఇదీ చదవండి :ఖమ్మంలో ఐటీహబ్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్