తెలంగాణ

telangana

By

Published : Jun 16, 2021, 4:57 AM IST

ETV Bharat / city

తొలిరోజు రూ. 516.95 కోట్ల రైతుబంధు నిధులు జమ

రైతుల ఖాతాల్లో తొలిరోజు రైతుబంధు 516.95 కోట్ల రూపాయలు జమయ్యాయి. అర్హులైన 16.95 లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు తెలిపింది. రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో అత్యధికంగా లక్షా 11వేల 970 మంది రైతులకు 36.10 కోట్లు, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9వేల 628 మందికి 35.60 లక్షల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది.

Rythu Bandhu First Day Credit with 5 hundred crores
Rythu Bandhu First Day Credit with 5 hundred crores

రైతుల ఖాతాల్లో తొలి రోజు రైతుబంధు 516.95 కోట్ల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది. అర్హులైన 16.95 లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు తెలిపింది. రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో అత్యధికంగా లక్షా 11వేల 970 మంది రైతులకు 36.10 కోట్లు, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9వేల 628 మందికి 35.60 లక్షల రూపాయలు జమ చేసినట్లు వ్యవసాయశాఖ ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 16 లక్షల 95 వేల 601 మంది అన్నదాతల అకౌంట్లలో నిధులు పంపించారు. రెండో రోజు రెండు ఎకరాల వరకు ఉన్న 15.07 లక్షల మంది ఖాతాల్లోకి 1152.46 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధికంగా నల్గొండలో లక్షా 10 వేల 407 మంది రైతుల ఖాతాల్లో 85.23 కోట్లు వేయనున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: CJI: సీజేఐకి గ్రీన్​ ఛాలెంజ్​... రాజ్​భవన్​లో మొక్క నాటిన జస్టిస్ ఎన్వీ రమణ

ABOUT THE AUTHOR

...view details