గాడిద పోటీలు మీరు ఎప్పుడైనా చూశారా? వినగానే ఆశ్చర్యం కలుగుతోంది కదు.! అయితే వీటిని తిలకించాలంటే ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలకు వెళ్లాల్సిందే. పట్టణ శివారులో వెలిసిన జంబులా పరమేశ్వరీ దేవి తిరునాళ్ల సందర్భంగా గాడిద పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు.
నంద్యాలలో ఆకట్టుకున్న గాడిద పోటీలు - Running competitions for Donkeys in Nandhayal
కోళ్ల పందెం, పోట్టేళ్ల పందెం, ఎడ్ల పందెం చూసి ఉంటాం. కానీ మనమెప్పుడు కనివినీఎరుగని పందెం ఒక్కటి ఉంది. అదే గాడిద పందెం. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా..? ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో. ఈ గాడిద పందెలను జంబులా పరమేశ్వరీ దేవి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
![నంద్యాలలో ఆకట్టుకున్న గాడిద పోటీలు domkeys race in nandya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10812878-544-10812878-1614511960289.jpg)
నంద్యాలలో ఆకట్టుకున్న గాడిద పోటీలు
నంద్యాలలో ఆకట్టుకున్న గాడిద పోటీలు
జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన రజకులు తమ గాడిదలను పరుగు బరిలో దింపారు. వంద కిలోల ఇసుక బస్తాను గాడిదపై ఉంచి పరుగుపందెం నిర్వహించారు. ఎక్కువ దూరం పరిగెత్తిన గాడిదలకు బహుమతులు అందజేశారు.