తెలంగాణ

telangana

ETV Bharat / city

Omicron Test: ఒమిక్రాన్​పై తెలంగాణ అలర్ట్.. - Omicron virus India

omicron tests in airports
omicron tests airports in telangana

By

Published : Nov 30, 2021, 2:14 PM IST

Updated : Nov 30, 2021, 4:02 PM IST

14:08 November 30

కొత్త వేరియంట్‌ ఇప్పటివరకు మన దేశంలోకి రాలేదు: డీహెచ్‌

Corona New Variant Omicron: కొత్త వేరియంట్‌ నేపథ్యంలో నేటి అర్ధరాత్రి నుంచి విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీహెచ్​ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు మన దేశంలో ఒమిక్రాన్​ కేసులు నమోదు కాలేదని డీహెచ్‌ స్పష్టం చేశారు. ఈ వేరియంట్​పై వస్తోన్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తే ఎన్ని మ్యుటేషన్లనైనా ఎదుర్కోవచ్చని డీహెచ్​ వివరించారు. కొత్త వేరియంట్​పై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్​ దిశానిర్దేశం చేశారన్న డీహెచ్​.. సీఎం ఛైర్మన్‌గా క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటైందన్నారు. ఈ క్రమంలో 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నట్టు వెల్లడించారు.

అసత్య ప్రచారాలు నమ్మొద్దు..

"ఒమిక్రాన్‌కు వేగంగా వ్యాపించే గుణం ఉంది. ఈ కొత్త వేరియంట్​కు తీవ్రత తక్కువగా ఉంది. ఈ వైరస్​ సోకిన బాధితుల్లో తలనొప్పి, అధిక నీరసం లాంటి లక్షణాలుంటున్నట్టు గమనించారు. ఒమిక్రాన్‌పై ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మొద్దు. కరోనా వైరస్‌లోనే సుమారు 3.5 లక్షల వేరియంట్లు వచ్చాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తే ఎన్ని మ్యుటేషన్లనైనా ఎదుర్కొవచ్చు. కొత్త వేరియంట్‌పై సీఎం ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సీఎం ఛైర్మన్‌గా కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటైంది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికి కొవిడ్‌ నిర్ధరణ కాలేదు. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా వంటి దేశాల్లో ఒమిక్రాన్‌ ఉంది. ఈ నేపథ్యంలో 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాం. విదేశాల నుంచి వచ్చే వారికి ఈ అర్ధరాత్రి నుంచి టెస్టులు నిర్వహించనున్నాం. విదేశీ ప్రయాణికుల నుంచి ర్యాండమ్‌గా నమూనాలు సేకరిస్తాం. 5 శాతం నమూనాలు తీసుకుని జీనోమ్ సీక్వెన్స్‌కు పంపుతాం." - శ్రీనివాసరావు, డీహెచ్​

ఇదీ చూడండి:

Last Updated : Nov 30, 2021, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details