APSRTC YSR Employees Union : ఆర్టీసీ రథ చక్రాలు ఆగితేనే సమ్మె ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే తమను భాగస్వాములను చేసేందుకు పీఆర్సీ సాధన సమితి ప్రయత్నిస్తోందని ఆర్టీసీ (పీటీడీ) వైఎస్సార్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య విమర్శించారు. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహకవర్గ సమావేశం అనంతరం చంద్రయ్య విలేకర్లతో మాట్లాడారు. తాము పీఆర్సీ సాధన సమితి సమ్మెలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.
APSRTC YSR Employees Union: 'పీఆర్సీ సమ్మెలో పాల్గొనం' - AP PRC issue
APSRTC YSR Employees Union: ఏపీలో ఆర్టీసీ రథ చక్రాలు ఆగితేనే సమ్మె ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే తమను భాగస్వాములను చేసేందుకు పీఆర్సీ సాధన సమితి ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ఆర్టీసీ (పీటీడీ) వైఎస్సార్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్లా చంద్రయ్య విమర్శించారు.
![APSRTC YSR Employees Union: 'పీఆర్సీ సమ్మెలో పాల్గొనం' APSRTC YSR Employees Union](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14320013-701-14320013-1643514374131.jpg)
పీఆర్సీ అమలైతేనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నామన్నారు. 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో 14వేల మందికి పైగా తమ సంఘంలో సభ్యులుగా ఉన్నారన్నారు. ఆర్టీసీలో 80 శాతానికి పైగా సాధారణ ఉద్యోగులు ఈ సమ్మెను వ్యతిరేకిస్తారని భావిస్తున్నామన్నారు. సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ఉపాధ్యక్షులు జె.ఎం.నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహం మాట్లాడుతూ తాము ప్రతి జిల్లాకు తిరిగి సమ్మెను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. 75 డిమాండ్లలో ఆర్టీసీకి సంబంధించినవి ఎన్ని ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :AP PRC Issue Updates : 'సహకరించని ఉద్యోగులపై కఠిన వైఖరి'