తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ టీఎంయూ చీలిక వర్గ ఆత్మీయ సమ్మేళనం - ఆర్టీసీ టీఎంయూ నేత థామస్ రెడ్డి వార్తలు

హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో ఆర్టీసీ టీఎంయూ చీలిక వర్గ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. యూనియన్​కు ప్రధాన కార్యదర్శిగా అశ్వత్థామరెడ్డి ఉండడానికి వీల్లేదని ఈ సమావేశంలో తీర్మానించామని ఆర్టీసీ టీఎంయూ నేత థామస్ రెడ్డి స్పష్టం చేశారు.

RTC TMU meeting at Bagh Lingampally in Hyderabad
ఆర్టీసీ టీఎంయూ చీలిక వర్గ ఆత్మీయ సమ్మేళనం

By

Published : Jan 29, 2021, 7:13 PM IST

ఎమ్మెల్సీ కవిత సారథ్యంలో థామస్ రెడ్డి వర్గం కార్మికుల సంక్షేమం కోసం ముందుకు సాగనున్నట్లు ఆర్టీసీ టీఎంయూ నేత థామస్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలో ఆర్టీసీ టీఎంయూ గ్రేటర్ హైదరాబాద్ జోన్ సమావేశం జరిగింది.

"అశ్వత్థామరెడ్డిని 2011లో నేనే నామినేట్ చేశా. నేటివరకు యూనియన్ మహాసభ జరగలేదు. ఎన్నికలు నిర్వహించలేదు. ఆయన యూనియన్​కు ప్రధాన కార్యదర్శిగా ఉండడానికి వీల్లేదని ఈ సమావేశం తీర్మానించింది. కరోనా కష్టకాలంలో ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకుంది. కార్మికుల కష్టాలను థామస్ రెడ్డి వర్గం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది."

- థామస్ రెడ్డి, ఆర్టీసీ టీఎంయూ నేత

ఏడాదిన్నరగా ఆర్టీసీ టీఎంయూ నేత అశ్వత్థామ రెడ్డి కార్మికుల ఇబ్బందులను పట్టించుకోకుండా.. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని థామస్ రెడ్డి మండిపడ్డారు. రోజు రోజుకి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పెరుగుతున్నాయని.. యాజమాన్యం నుంచి కార్మికుల వేధింపులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో యూనియన్లు లేవని కార్మికుల పట్ల యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 'నిరుద్యోగ భృతి పట్ల సీఎం నాటకాలాడుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details