తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ సమ్మె@అరెస్టులు, ఆందోళనలు - tsrtc strike latest upadates

ఆర్టీసీ ఐకాస నేతలు తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను, రాజకీయ నేతలను అరెస్టు చేస్తున్నారు. సచివాలయం వద్ద మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆరుగురు ఆర్టీసీ కార్మికులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టీసీ సమ్మె@ అరెస్టులు, ఆందోళనలు

By

Published : Nov 9, 2019, 11:33 AM IST

హైదరాబాద్​ ట్యాంక్​బండ్​ పరిసరాలు నివురుగప్పిన నీరులా మారాయి. ఆర్టీసీ ఐకాస నేతలు తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కార్మికులను, రాజకీయ నేతలను అరెస్టు చేస్తున్నారు. సచివాలయం వద్ద మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆరుగురు ఆర్టీసీ కార్మికులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మికులకు పోలీసులకు త్రీవ వాగ్వాదం జరిగింది. వీరిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

ఆర్టీసీ సమ్మె@ అరెస్టులు, ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details