తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆర్టీసీ ప్రయాణం.. సురక్షితం, శుభప్రదం' - RTC CMD Campaigning on Mobile Mike

ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు వినూత్న పద్ధతిలో ప్రచారం చేపట్టారు. స్వయంగా ఆ సంస్థ సీఎండీనే రంగంలోకి దిగి ఆర్టీసీ అందిస్తున సేవలు, సురక్షిత ప్రయాణం గురించి మొబైల్ మైక్​లో ప్రజలకు అవగాహన కల్పించారు.

rtc md announce the facilities for transport in telangana
మా బస్సు ఎక్కండి.... మిమ్మల్ని క్షేమంగా గమ్యస్థానికి చేర్చుతాం

By

Published : Mar 9, 2020, 9:27 AM IST

'మీ ఆదరణే సంస్థకు బలం.. మా బస్సుల్లో ప్రయాణించండి' అని డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ ప్రయాణికులను అభ్యర్థించారు. 'అత్యంత అనుభవం ఉన్న డ్రైవర్లు, కండిషన్​లో ఉన్న బస్సులు మా ప్రత్యేకత. అందుకే ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం. మిమ్మల్ని మా డ్రైవర్లు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతారు' అని డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి స్వయంగా ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ మొబైల్ మైక్​లో ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

సికింద్రాబాద్​లోని గురుద్వార్ బస్ స్టాప్​లో మైక్​లో ప్రచారం చేశారు. స్వయంగా సంస్థ సీఎండీనే రంగంలోకి దిగి ఆర్టీసీ ప్రయాణంపై ప్రచారం చేయడం వల్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

మా బస్సు ఎక్కండి.... మిమ్మల్ని క్షేమంగా గమ్యస్థానికి చేర్చుతాం

ఇదీ చూడండి:గ్రామీణ ప్రాంతాల్లోనూ తల్లిపాలపై అవగాహన కల్పించాలి

ABOUT THE AUTHOR

...view details