తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని కలిసిన ఆర్టీసీ ఐకాస నాయకులు - tsrtc strike latest news in hyderabad

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆర్టీసీ ఐకాస నాయకులు కలిశారు. ఆర్టీసీ సమ్మెను అమిత్​ షా దృష్టికి తీసుకెళ్తనని కిషన్​ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని కలిసిన ఆర్టీసీ ఐకాస నాయకులు

By

Published : Nov 14, 2019, 7:45 PM IST

Updated : Nov 15, 2019, 9:09 AM IST

హైదరాబాద్ హైదర్​గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే వసతి గృహంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆర్టీసీ ఐకాస నాయకులు కలిశారు. కిషన్ రెడ్డి సమ్మెపై వివరాలను అడిగి తెలుసుకున్నారని ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా దృష్టికి తీసుకెళ్తానని... అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్​తో కూడా మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని కలిసిన ఆర్టీసీ ఐకాస నాయకులు
Last Updated : Nov 15, 2019, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details