తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఏపీఎస్ ఆర్టీసీలోనే కొనసాగుతున్నట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జరగదని, కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. విద్యానగర్‌లో ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష పార్టీల నేతలు నాలుగు గంటలకు పైగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈనెల 4న లేదా 5వ తేదీల్లో దిల్లీకి వెళ్లి కేంద్రం జోక్యం చేసుకోవాలని భాజపా ముఖ్య నేతలను కోరుతామన్నారు. ఆర్టీసీ సమ్మె తదుపరి కార్యాచరణను ప్రకటించారు. ఈనెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ సమ్మెను దిల్లీకి తీసుకెళ్తాం: అశ్వత్థామరెడ్డి - tsrtc latest updates
తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆర్టీసీ సమ్మె కొనసాగిస్తామని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ విభజన జరగలేదని, తాము ఇంకా ఏపీఎస్‌ఆర్టీసీలోనే ఉన్నామని చెప్పారు. సమ్మెను దిల్లీకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
సమ్మె పరిష్కారానికి దిల్లీకి వెళ్తాం: అశ్వత్థామరెడ్డి
వారం రోజుల కార్యచరణ:
- 3 నవంబర్: అన్ని డిపోలు, గ్రామాల్లో ఆర్టీసీ సమావేశాలు
- 4 నవంబర్: రాజకీయ పార్టీలతో కలిసి డిపోల వద్ద దీక్షలు
- 5 నవంబర్: సడక్ బంద్
- 6 నవంబర్: డిపోల ముందు నిరసనలు
- 7 నవంబర్: కార్మికుల కుటుంబాలతో డిపోల ముందు దీక్షలు
- 9 నవంబర్: ట్యాంక్‌బండ్‌పై దీక్షలు, నిరసనలు
Last Updated : Nov 2, 2019, 6:05 PM IST