తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను పక్కకుపెట్టినా సరే.. - వెనక్కి తగ్గిన ఆర్టీసీ ఐకాస

ప్రభుత్వ వైఖరి కారణంగానే ఆర్టీసీ కార్మికుల బలవుతున్నారని ఐకాస కన్వీనర్​ రాజిరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ తాత్కాలికంగా పక్కకు పెట్టైనా మిగిలిన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.

ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను పక్కకుపెట్టినా సరే..

By

Published : Nov 14, 2019, 6:06 PM IST

Updated : Nov 14, 2019, 8:16 PM IST

హైదరాబాద్​ పాతబస్తీలోని ఫారుఖ్​నగర్​ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధూంధాం, వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్​ రాజిరెడ్డి హాజరయ్యారు. హైకోర్టు సూచించినా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం దారుణమన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను తాత్కాలికంగా పక్కకు పెట్టైనా మిగిలిన సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగానే కార్మికులు బలి అవుతున్నారని రాజిరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతునివ్వాలని కోరారు. తాత్కాలిక సిబ్బంది విధులకు హాజరవ్వకుండా.. సంఘీభావం తెలపాలని విజ్ఞప్తిచేశారు.

ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్​ను పక్కకుపెట్టినా సరే..
Last Updated : Nov 14, 2019, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details