ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ప్రగతి భవన్ ముందు నిరసన తెలిపేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ప్రగతి భవన్ ముందు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల నిరసన - ప్రగతి భవన్ ముందు ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల నిరసనయత్నం
మూడు నెలల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ప్రగతి భవన్ మందు నిరసన తెలిపేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
![ప్రగతి భవన్ ముందు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల నిరసన rtc hire bus owners try to protest at pragathi bhavan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8186688-thumbnail-3x2-rtc.jpg)
ప్రగతి భవన్ ముందు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల నిరసన
మూడు నెలలుగా అద్దె చెల్లించడం లేదని, తమ సమస్యలు పరిష్కరించాలని యజమానుల సంఘం ప్రగతి భవన్, బస్ భవన్ ముందు, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. లాక్డౌన్ కారణంగా 25శాతం బస్సులు మాత్రమే నడపడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:మంచు శిఖరంపై మరపురాని విజయానికి 21 వసంతాలు