తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీ బస్సులను మెట్రోకు అద్దెకివ్వడం తగదు : ఆర్టీసీ ఈయూ

రాష్ట్ర ప్రభుత్వం అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం చేసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ఆర్టీసీల మధ్య బస్సు సర్వీసుల ఒప్పందంలో రెండు ఆర్టీసీ యాజమాన్యాల మధ్య చర్చలు కొలిక్కి రాక తీవ్ర జాప్యం జరుగుతున్నదని.. ఈ నేపథ్యంలో ట్రాన్స్​పోర్ట్​ మాఫియా బస్సుల కాంట్రాక్టు, క్యారేజీ పర్మిట్లు తీసుకుని స్టేజి క్యారేజ్​లను యథేచ్ఛగా తిప్పుతున్నాయని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఆరోపించారు.

RTC Employs Union Protest Against Inter Services
ఆర్టీసీ బస్సులను మెట్రోకు అద్దెకివ్వడం తగదు : ఆర్టీసీ ఈయూ

By

Published : Oct 3, 2020, 9:39 PM IST

Updated : Oct 4, 2020, 12:23 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం చేసుకోవాలని ఎంప్లాయిస్​ యూనియన్​ డిమాండ్​ చేసింది. ఆర్టీసీ బస్సులను మెట్రోకు అద్దెకిచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఈయూ కోరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ఆర్టీసీల మధ్య బస్సు సర్వీసుల ఒప్పందంలో తీవ్ర జాప్యం జరుగుతున్న కారణంగా మాఫియా అవకాశంగా తీసుకొని అక్రమ రవాణా చేస్తున్నదని ఆరోపించారు. అక్రమ రవాణా మాఫియా ప్రజల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూసీ.. చూడనట్లుగా వ్యవహరించడాన్ని యూనియన్ అధ్యక్షుడు ఎస్​.బాబు, కార్యదర్శి కె రాజిరెడ్డి తప్పు పట్టారు. 800 బస్సులకు కొత్త పర్మిట్లు తీసుకొని ప్రైవేటు వ్యక్తులు ట్రాన్స్​పోర్ట్ మాఫియాకు సిద్ధమవుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధిలేని ప్రభుత్వాలే.. అక్రమ రవాణా మాఫియాకు మద్దతునిస్తూ.. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తున్నాయని యూనియన్​ నాయకులు ఆరోపించారు.

మెట్రో ప్రారంభం నుంచి గ్రేటర్ ఆర్టీసీ, మెట్రో సంస్థల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయని.. ఆర్టీసీలో, మెట్రోలో తిరగడానికి మెట్రో- ఆర్టీసీ కాంబినేషన్ పాస్​ ప్రవేశ పెట్టాలని కోరినట్లు ఈయూ నాయకులు తెలిపారు. మెట్రో స్టేషన్ల నుంచి వివిధ కంపెనీలకు, కాలనీలకు ఆర్టీసీ బస్సులు నడపడానికి ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. ఆర్టీసీలో ఉన్న 3700 బస్సులలో నుంచి సుమారు 800 బస్సులు రద్దు చేసుకోవడం వల్ల మెట్రోకు లాభాలు చేకూర్చడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీని అభివృద్ధి చేసే ఉద్ధేశ్యం లేదని అర్థమవుతున్నట్టు రాజిరెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వం వెంటనే మెట్రోకు ఆర్టీసీ బస్సులు అద్దెకిచ్చే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలన్నారు. ఆర్టీసీలో వజ్ర బస్సులు, మినీ బస్సులు ఉన్నాయని అదనపు సిబ్బంది కూడా ఉన్నారని.. మినీబస్సులు తీసుకొని మెట్రో స్టేషన్ల నుంచి సాఫ్ట్​వేర్ కంపెనీలకు, కాలనీలకు, ఆర్టీసీ బస్సులు నడపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంతరాష్ట్ర ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ బస్సులను మెట్రోకు అద్దెకిచ్చే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది.

ఇవీచూడండి:ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల వేడి

Last Updated : Oct 4, 2020, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details