తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇదే ఆఖరి పోరాటం కావాలి: ఆర్టీసీ ఐకాస - టీఎస్​ ఆర్టీసీ సమ్మె

తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని టీఎస్​ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ఇది ఆత్మగౌరవ పోరాటంగా ఆయన అభివర్ణించారు. సమ్మె సన్నాహకంలో భాగంగా ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు.

ts rtc strike

By

Published : Sep 30, 2019, 8:59 PM IST

ఇదే ఆఖరి పోరాటం కావాలి: ఆర్టీసీ ఐకాస

యాజమాన్యం, ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలకు పోకుండా చర్చల ద్వారా సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని టీఎస్​ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సమస్యను జఠిలం చేసి సమ్మెను ఏవిధంగా అణచివేయాలనే దిశగా ఆలోచించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే ఆఖరి పోరాటం కావాలని అన్నారు. సమ్మె సన్నాహకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్​ఎం కార్యాలయాల వద్ద సామూహిక నిరహారదీక్షలు చేయాలని జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి రీజియన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు సామూహిక నిరాహారదీక్ష చేసిన ఆర్టీసీ కార్మికులకు... ఐకాస నాయకులు నిమ్మరసం ఇచ్చి ఒక్కరోజు దీక్ష విరమింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details